Create an account or log in to Instagram - A simple, fun & creative way to capture, edit & share photos, videos & messages with friends & family.
Link in below.
కమ్యూనిటీ మార్గదర్శకాలు
COVID-19: కమ్యూనిటీ మార్గదర్శకాల అప్‌డేట్‌లు మరియు సంరక్షణలు: ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ప్రజారోగ్యానికి సంబంధించి మునుపెన్నడూ సంభవించని ఈ అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటున్నందున, మా కమ్యూనిటీ మార్గదర్శకాలు COVID-19కి సంబంధించిన హానికరమైన కంటెంట్ మరియు కొత్త రకాల దుర్వినియోగాల నుంచి వ్యక్తులను రక్షిస్తాయని మేము నిర్ధారించుకోవాలనుకుంటున్నాము. హాని కలిగించడానికి సహకరించడం, వైద్యసంబంధిత మాస్క్‌లు మరియు సంబంధిత వస్తువుల విక్రయం, ద్వేషపూరిత ప్రసంగం, వేధింపు మరియు బెదిరింపు మరియు తక్షణం జరగబోయే హింస లేదా భౌతిక హాని రిస్క్‌కు కారణమయ్యే తప్పు సమాచారాన్ని నిషేధించేటటువంటి మా విధానాల ద్వారా నిజ-సమయంలో హాని జరగడానికి తోడ్పడే సామర్థ్యం గల కంటెంట్‌ను తీసివేయడానికి మేము కృషి చేస్తున్నాము. COVID-19 మరియు వ్యాక్సిన్‌లకు సంబంధించిన మా విధానాలను గురించి మరింత సమాచారాన్ని తెలుసుకునేందుకు, ఇక్కడ చూడండి.
క్లుప్తంగా
ప్రేరణ మరియు వ్యక్తీకరణ కోసం Instagram ప్రామాణికమైన మరియు సురక్షితమైన స్థలంగా కొనసాగాలని మేము కోరుకుంటున్నాము. ఈ కమ్యూనిటీని అభివృద్ధి చేయడంలో మాకు సహాయపడండి. మీ స్వంత ఫోటోలు మరియు వీడియోలను మాత్రమే పోస్ట్ చేయండి అలాగే చట్టాన్ని ఎల్లప్పుడూ పాటించండి. Instagramలో ప్రతి ఒక్కరినీ గౌరవించండి, వ్యక్తులకు స్పామ్ పంపవద్దు లేదా నగ్నత్వాన్ని పోస్ట్ చేయవద్దు.
వివరంగా
Instagram అనేది మా భిన్నమైన సంస్కృతులు, వయస్సులు మరియు విశ్వాసాల కమ్యూనిటీని ప్రతిబింబిస్తుంది. ప్రతి ఒక్కరి కోసం సురక్షితమైన మరియ బహిరంగమైన వాతావరణాన్ని కల్పించేందుకు భిన్నమైన దృష్టి కోణాల గురించి ఆలోచిస్తూ మేము చాలా ఎక్కువ సమయం గడిపాము.
మేము కమ్యూనిటీ మార్గదర్శకాలను సృష్టించాము, కాబట్టి మీరు ఈ అద్భుతమైన కమ్యూనిటీని అభివృద్ధి చేయడంలో మరియు రక్షించడంలో మాకు సహాయపడవచ్చు. Instagramని ఉపయోగించడం ద్వారా, మీరు ఈ మార్గదర్శకాలకు మరియు మా వినియోగ నిబంధనలకు అంగీకరిస్తున్నారు. మేము ఈ మార్గదర్శకాలకు కట్టుబడి ఉన్నాము, అలాగే మీరు కూడా కట్టుబడి ఉంటారని ఆశిస్తున్నాము. ఈ హద్దులను అతిక్రమించడం వల్ల కంటెంట్ తొలగించబడవచ్చు, ఖాతాలు నిలిపివేయబడవచ్చు లేదా ఇతర పరిమితులు విధించబడవచ్చు.
కొన్ని సందర్భాల్లో, కంటెంట్ మా కమ్యూనిటీ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నప్పటికీ ప్రచురించదగినది అయితే ప్రజా ప్రయోజనార్థం ప్రజల్లో అవగాహన కల్పించడానికి మేము దాన్ని అనుమతిస్తాము. హాని కలిగించే రిస్క్‌కు సంబంధించి ప్రజా ప్రయోజన విలువను మూల్యాంకనం చేసిన తర్వాత మాత్రమే మేము దీన్ని చేస్తాము మరియు ఈ నిర్ణయాలు తీసుకునే ముందు మేము అంతర్జాతీయ మానవ హక్కుల ప్రమాణాలను పరిశీలిస్తాము.
మీరు తీసిన లేదా షేర్ చేయడానికి హక్కులు కలిగి ఉన్న ఫోటోలు మరియు వీడియోలను మాత్రమే షేర్ చేయండి.
ఎప్పటిలాగానే, Instagramలో మీరు పోస్ట్ చేసే కంటెంట్ మీ స్వంతం. ప్రామాణిక కంటెంట్‌ను పోస్ట్ చేయాలని గుర్తుంచుకోండి, అలాగే మీకు పోస్ట్ చేసే హక్కు లేనటువంటి ఇంటర్నెట్ నుంచి కాపీ చేసిన లేదా సేకరించిన దేన్నీ పోస్ట్ చేయవద్దు. మేధోసంపత్తి హక్కుల గురించి మరింత తెలుసుకోండి.
భిన్నమైన ఆడియన్స్‌కు తగినట్లు ఉండే ఫోటోలు మరియు వీడియోలను పోస్ట్ చేయండి.
కొన్ని సందర్భాల్లో వ్యక్తులు కళాత్మకంగా లేదా సృజనాత్మకంగా ఉన్న నగ్న చిత్రాలను షేర్ చేయాలనుకోవచ్చని మాకు తెలుసు, అయితే వివిధ కారణాల దృష్ట్యా, మేము Instagramలో నగ్నత్వాన్ని అనుమతించము. ఇందులో లైంగిక సంపర్కం, జననేంద్రియాలు మరియు పూర్తి నగ్నంగా ఉన్న పిరుదులను దగ్గరి నుంచి చూపే ఫోటోలు, వీడియోలు మరియు డిజిటల్‌గా సృష్టించిన కొంత కంటెంట్ ఉంటాయి. అలాగే ఇందులో మహిళల చనుమొనల ఫోటోలు కూడా కొన్ని ఉంటాయి, అయితే తల్లి పాలిచ్చే సందర్భంలో, ప్రసవం జరుగుతున్న మరియు ప్రసవం తదనంతర క్షణాలు, ఆరోగ్యానికి సంబంధించిన పరిస్థితులు (ఉదాహరణకు, స్తనచ్ఛేదన తదనంతరం, బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన లేదా లింగ నిర్ధారణ శస్త్రచికిత్స) లేదా నిరసన చర్యకు సంబంధించిన ఫోటోలు అనుమతించబడతాయి. అంతేకాకుండా పెయింటింగ్‌లు మరియు శిల్పాల ఫోటోల్లో నగ్నత్వానికి అనుమతి ఉంది.
వ్యక్తులు తమ పిల్లల ఫోటోలు లేదా వీడియోలను షేర్ చేయడానికి ఇష్టపడతారు. భద్రతా కారణాల దృష్ట్యా, కొన్ని సందర్భాల్లో మేము పిల్లలను నగ్నంగా లేదా పాక్షికంగా నగ్నంగా చూపే చిత్రాలను తీసివేయవచ్చు. ఈ కంటెంట్‌ను సదుద్దేశ్యంతో షేర్ చేసినప్పటికీ దీన్ని ఇతరులు ఊహించని మార్గాల్లో ఉపయోగించవచ్చు. మా తల్లిదండ్రుల కోసం చిట్కాలు పేజీలో మీరు మరింత తెలుసుకోవచ్చు.
అర్థవంతమైన మరియు నిజాయితీతో కూడిన ఇంటరాక్షన్‌లను పెంపొందించండి.
లైక్‌లు, ఫాలోయర్‌లు లేదా షేర్‌లను కృత్రిమంగా సేకరించడం, పునరావృత కామెంట్‌లు లేదా కంటెంట్‌ను పోస్ట్ చేయడం లేదా వాణిజ్య అవసరాల కోసం వ్యక్తుల సమ్మతి లేకుండా వారిని పదే పదే సంప్రదించడం వంటివి చేయకుండా ఉండటం ద్వారా స్పామ్-రహితంగా ఉండేందుకు మాకు సహాయపడండి. లైక్‌లు, ఫాలోయర్‌లు, కామెంట్‌లు లేదా ఇతర ఎంగేజ్‌మెంట్‌కు బదులుగా డబ్బు ఇవ్వడం లేదా నగదు బహుమతులు ఇవ్వడం చేయవద్దు. నకిలీ మరియు తప్పుదారి పట్టించే వినియోగదారు సమీక్షలు మరియు రేటింగ్‌లను అందించడం, అభ్యర్థించడం లేదా వ్యాపారం చేయడంతో సంబంధం ఉండే, వాటిని పెంపొందించే, ప్రోత్సహించే, ఆ సౌలభ్యం కల్పించే లేదా అంగీకరించే కంటెంట్‌ను పోస్ట్ చేయవద్దు.
మీరు Instagramలో మీ అసలు పేరును ఉపయోగించాల్సిన అవసరం లేదు, కానీ Instagram వినియోగదారులు ఖచ్చితమైన మరియు తాజా సమాచారాన్ని అందించడం మాకు అవసరం. ఇతరులను అనుకరించడం, అలాగే మా మార్గదర్శకాలను ఉల్లంఘించే లేదా ఇతరులను తప్పుదారి పట్టించే కారణాల కోసం ఖాతాలను సృష్టించడం చేయవద్దు.
చట్టాన్ని పాటించండి.
తీవ్రవాదం, వ్యవస్థీకృత నేరం లేదా ద్వేషాన్ని వ్యాపింపజేసే వర్గాలకు మద్దతివ్వడానికి లేదా వారిని కీర్తించడానికి Instagramని ఉపయోగించకూడదు. లైంగిక సేవలు అందించడం, ప్రైవేట్ వ్యక్తుల.
Click below for link 👇
Comments
Post a Comment